Logo
Date of Publish : 01 November 2026, 11:29 am
Editor : Vinay Narlagiri

శ్రీ కనకదుర్గ ఆలయానికి నూతన నల్లా కనెక్షన్ మంజూరు చేయాలి

 

మున్సిపల్ కమిషనర్‌కు ఆలయ కమిటీ ప్రతినిధుల వినతి

 

హమారా తెలంగాణ | మడికొండ:

మడికొండలోని శ్రీ కనకదుర్గ దేవాలయానికి నూతన మున్సిపల్ నల్లా కనెక్షన్ మంజూరు చేసి, నిరంతర నీటి సరఫరా కల్పించాలని కోరుతూ ఆలయ కమిటీ ప్రతినిధులు శనివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయానికి ప్రత్యేక మున్సిపల్ నీటి కనెక్షన్ లేకపోవడంతో నిత్య పూజలు, అభిషేకాలు, భక్తుల అవసరాలు, ఆలయ ప్రాంగణ పరిశుభ్రత వంటి కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిటీ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

దేవాలయంలో ప్రతిరోజూ నిర్వహించే పూజా కార్యక్రమాలకు, అభిషేకాలకు నీరు అత్యంత అవసరమని, భక్తుల సౌకర్యార్థం తక్షణమే నూతన నల్లా కనెక్షన్ మంజూరు చేసి నీటి సరఫరా కల్పించాలని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పల్లపు అశోక్ కోరారు.

ఈ విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చీకటి రాజు, బల్సుకురి రాజ్ కుమార్, దువ్వ సందీప్, దువ్వ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

హమారా తెలంగాణ – ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.


All Rights Reserved By Hamara Telangana.
Print Save
  • Home
  • Inter National
  • National
  • Telangana
  • District news
  • Cinema
  • Sports
  • Health
  • Business
  • E-paper
  • Reporter Apply
  • Reporters
  • Verify Reporter
  • Home
  • Inter National
  • National
  • Telangana
  • District news
  • Cinema
  • Sports
  • Health
  • Business
  • E-paper
  • Reporter Apply
  • Reporters
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com
( 9052933264 )