Logo
Date of Publish : 15 August 2026, 11:36 am
Editor : Vinay Narlagiri

డీజిల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

క్రీడా స్ఫూర్తితో డీజిల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు నూతన క్రీడా సామగ్రి ప్రారంభం.. విజేతలకు బహుమతులు ప్రదానం

వరంగల్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డీజిల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆవరణలో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. దేశభక్తి, క్రీడా స్ఫూర్తి, ఉద్యోగుల ఐక్యతను చాటేలా జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బిలియర్డ్స్, స్నూకర్ టేబుల్స్, క్యారమ్స్ బోర్డ్స్‌తో పాటు వాలీబాల్, షటిల్, చెస్ క్రీడలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ డీఎంఈ ఎన్.వి. వెంకట కుమార్ గారు క్రీడలను ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయనతో పాటు సతీమణి, డీఎంఈ అనికేత్ ఖడే దంపతులు, ఏడీఎంఈ-1 బి. శ్రీనివాసరావు, ఏడీఎంఈ-2 వి.ఆర్. నాగరాజా దంపతులు, ఏడీఈ సతీష్, ఏసీఎంటీ మల్లికార్జునరావు దంపతులు పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహపరిచారు.

క్రీడల్లో ప్రతిభ చాటిన విజేతలు

 

బిలియర్డ్స్: రవికిరణ్ – అంతయ్య

స్నూకర్: రవికిరణ్ – హరిభాస్కర్

క్యారమ్స్: రాముల సదానందం – జి. శ్రీనివాస్

చెస్: వి. సాయి కృష్ణ – జె. సురేందర్

 

వాలీబాల్ విజేతలు: M2 టీం

రన్నర్స్: E2 & E4 టీమ్స్

 

మహిళల విభాగంలో విజేతలు: విజయ, హారిక, సుస్మిత

ఈ సందర్భంగా సంస్థలో క్రీడా వాతావరణాన్ని మరింత ప్రోత్సహించేందుకు నూతన క్రీడా సామగ్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. క్రీడలు ఉద్యోగుల్లో ఆరోగ్యం, ఉత్సాహం, స్నేహభావం, టీమ్ స్పిరిట్‌ను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో SCRMU తరఫున పి. వేదప్రకాశ్, ఇన్‌స్టిట్యూట్ కమిటీ సభ్యులు సల్మాన్ రాజ్, రాముల సదానందం, జి. శంకర్, కె. భాస్కర్ రెడ్డి, ఆంథోనీ స్వామి, ఎస్. నర్సయ్య, అలాగే ఈఎఫ్ అమలారావు, ఎల్ఎఫ్ రాజశేఖర్, సూపర్‌వైజర్లు, ఇన్‌స్టిట్యూట్ సిబ్బంది, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

జాతీయ పండుగను క్రీడా స్ఫూర్తితో కలిపి ఘనంగా నిర్వహించిన డీజిల్ ఇన్‌స్టిట్యూట్ కార్యక్రమం ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.


All Rights Reserved By Hamara Telangana.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ-పేపర్
  • Reporter Apply
  • Reporters
  • Verify Reporter
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ-పేపర్
  • Reporter Apply
  • Reporters
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com
( 9052933264 )