Logo
Date of Publish : 02 November 2026, 5:04 am
Editor : Vinay Narlagiri

సంప్రదాయ వేడుకల నడుమ ఘనంగా కుమారి సాయి స్మితిక ఓణి ఫంక్షన్

సంప్రదాయ వేడుకల నడుమ ఘనంగా కుమారి సాయి స్మితిక ఓణి ఫంక్షన్

చిన్నారి సాయి స్మితికకు ఆశీర్వచనాలు అందించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రైల్వే అధికారులు

హమారా వరంగల్, కాజీపేట, నవంబర్ 1:

తెలుగు సంప్రదాయాలు, కుటుంబ ఆప్యాయతలు, బంధుమిత్రుల సందడి మధ్య కుమారి సాయి స్మితిక ఓణి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. హనుమకొండలోని వడ్డేపల్లి, తెలంగాణ చౌరస్తా సమీపంలోని టీచర్స్ కాలనీలో ఉన్న పి.ఎస్.ఆర్. కాంప్లెక్స్‌లో ఈ వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

శ్రీమతి, శ్రీ మూల ఉదయశ్రీ–రమేష్ దంపతుల ఏకైక కుమార్తె సాయి స్మితిక ఓణి వేడుకను సంప్రదాయబద్ధంగా నూతన వస్త్రాలు, పుష్పాలంకరణలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించారు. ఈ శుభకార్యానికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు చిన్నారికి ఆశీస్సులు అందజేశారు.

ఈ సందర్భంగా సాయి స్మితిక ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకకు రైల్వే శాఖకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు హాజరై చిన్నారిని ఆశీర్వదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమంలో రైల్వే హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నిరంజన్ (MS), డాక్టర్ నరేందర్, ఏడీఈఎన్ జి. శాంతికిరణ్, ఎం.ఎన్. రావు, నార్లగిరి సంపత్, డిప్యూటీ డీఎస్ దిలీప్ కొదేటి, ఎస్.కె. ఇమ్రాన్ అహ్మద్, ఏ.ఎస్.ఆర్. ప్రసాద్, బలరాజు, బిక్షపతి, రామ్మోహన్, వెంకటాచారి, మల్లేష్, సంతోష్, ప్రసాద్, రాజు, ఎం.డి. ఇక్బాల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

 

ఆత్మీయుల పలకరింపులు, పెద్దల ఆశీర్వచనాలు, బంధుమిత్రుల ఆనందోత్సాహాల నడుమ సాయి స్మితిక ఓణి వేడుకలు కన్నుల పండువగా ముగిశాయి.


All Rights Reserved By Hamara Telangana.
Print Save
  • Home
  • Inter National
  • National
  • Telangana
  • District news
  • Cinema
  • Sports
  • Health
  • Business
  • E-paper
  • Reporter Apply
  • Reporters
  • Verify Reporter
  • Home
  • Inter National
  • National
  • Telangana
  • District news
  • Cinema
  • Sports
  • Health
  • Business
  • E-paper
  • Reporter Apply
  • Reporters
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com
( 9052933264 )