29/11/2026, Sunday · 07:59:38 AM About UsPrivacy PolicyContact Us
Hamara telangana
Hamara telangana

This is Short News — best viewed on mobile.

News ePaper
S
Sushma
District Bureau Chief
12 hours ago

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు భారీ ఉద్యోగ అవకాశాలు

HAMARA WARANGAL | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 70 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించే దిశగా కీలక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సుమారు 3,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది

A
Anusha
Constituency Incharge
12 hours ago

ఘనపూర్ డ్యామ్.. ఆధ్యాత్మికతకు, ప్రకృతి అందాలకు నిలయం

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలోని ఘనపూర్ డ్యామ్ ప్రకృతి అందాలతో పాటు ఆలయాల ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఘనపూర్ డ్యామ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభించే

S
Sushma
District Bureau Chief
13 hours ago

🦀 కాజీపేటలో సీ ఫుడ్ స్టాక్ రీలోడెడ్

కాజీపేట: సముద్ర ఆహార ప్రియులకు గుడ్ న్యూస్. MM MEAT MARTలో ఆదివారం (29-11-2026) ఉదయం తాజా సీ ఫుడ్ స్టాక్ అందుబాటులోకి రానుంది. ఫ్రెష్ చేపలు, రొయ్యలు, పీతలు, స్క్విడ్ తదితర సముద్ర ఆహార పదార్థాలు పరిమిత స్టాక్‌లో లభించనున్నాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగానే చేరుకుని తమకు నచ్చిన సీ ఫుడ్‌ను కొనుగోలు చేయవచ్చు. 📍 చిరునామా: అమీర్ హోటల్ ఎదురుగా, బాపూజీనగర్, కాజీపేట.

S
Sushma
District Bureau Chief
14 hours ago

జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు డిసెంబర్‌లో తెరలేవనుందా?

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. డిసెంబర్ చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వివిధ డివిజన్లలో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు ఇప్పటి నుంచే ప్రజలను కలుస్తూ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రధాన పార్టీల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది.

N
Narlagiri Vinay
Editor
16 hours ago

కాజీపేట్ పోలీస్ స్టేషన్‌కు తాగునీటి సదుపాయం కల్పించిన మాజీ కార్పొరేటర్

కాజీపేట్ పోలీస్ స్టేషన్‌కు దివంగత గుంటి కనక తార జ్ఞాపకార్థం తాగునీటి సదుపాయాన్ని బహుకరించిన మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామికి కాజీపేట్ పోలీస్ స్టేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ సిబ్బందికి, స్టేషన్‌కు వచ్చే ప్రజలకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది.

N
Narlagiri Vinay
Editor
20 days ago

ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్

TG: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌ తీస్తే BRS ఓడిపోయిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఆటో డ్రైవర్లలో కలసి ఆ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. తగ్గిన బడ్జెట్ చెప్పడంతో భయపడి వెనక్కి తగ్గారని తెలిపారు. ఆటో డ్రైవర్లను మరో విధంగా ఆదుకుంటామని, ఈ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

N
Narlagiri Vinay
Editor
43 days ago

రైతుపై మళ్లీ భారం.. భూమి శిస్తు వసూలుకు మంత్రి పొంగులేటి

నాలుగు దశాబ్దాల క్రితం రైతులకు భారంగా మారిన భూమి శిస్తును ఎన్టీఆర్‌ 1984లో రద్దు చేశారు. శిస్తు చెల్లించలేక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికారుల వేధింపులు చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ భూమి శిస్తు వసూలుకు సిద్ధమవుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

N
Narlagiri Vinay
Editor
43 days ago

ఏషియన్ గేమ్స్ హీరోలకు మోదీ నినాదం.. మనం చేసి చూపిద్దాం!

ఆసియా క్రీడల్లో సత్తాచాటిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. “మనం చేసి చూపిద్దాం” అంటూ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. భారత్‌ను ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలపడమే లక్ష్యమన్నారు. క్రీడాకారుల విజయాలను అభినందిస్తూ, కోచ్‌లు, సహాయక సిబ్బంది కృషిని కొనియాడారు.

N
Narlagiri Vinay
Editor
43 days ago

రాష్ట్రపతికి మంగళగిరి చీర, ఏటికొప్పాక బొమ్మ బహూకరించిన లోకేశ్

మంత్రి నారా లోకేశ్ విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఆంధ్రప్రదేశ్ చేనేత వైభవానికి ప్రతీకగా మంగళగిరి చీర, హస్తకళలకు గుర్తింపుగా ఏటికొప్పాక లక్క బొమ్మలను బహూకరించారు. దసరా ఉత్సవాలు, జాతీయ సరస్ మేళాలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

N
Narlagiri Vinay
Editor
43 days ago

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు వీఐపీ, సిఫార్సు దర్శనాలను రద్దు చేశారు. ఉచిత దర్శనానికి మాత్రమే అనుమతిస్తూ భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.