63వ డివిజన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

63వ డివిజన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

హనుమకొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 63వ డివిజన్‌లోని బాపూజీ నగర్, అంబేద్కర్ నగర్ వాటర్ ట్యాంక్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాలతో పాటు 62వ డివిజన్‌లోని సోమిడి, వైఎస్సార్ నగర్ ప్రాంతాల్లో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.

 

ఈ కార్యక్రమాల్లో 63వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ విజయ శ్రీ సయ్యద్ రజాలి ముఖ్యంగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

విజయ శ్రీ సయ్యద్ రజాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ ఎండి షబ్బీర్ అలీ, క్రాంతి భరత్, కాసర్ల నాగేష్, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ బిలాల్, ఎండి షాకీర్, ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకులు పోగుల రాకేష్, బొట్టు వసంత్ తదితరులు పాల్గొన్నారు.

 

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విజయ శ్రీ సయ్యద్ రజాలి దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.